చేపల వేటకు వెళ్లిన ఇద్దరు బాలికలు చెరువులో పడి మృతి చెందారు.
వరంగల్: చేపల వేటకు వెళ్లిన ఇద్దరు బాలికలు చెరువులో పడి మృతి చెందారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా మంగపేట మండలం శేనగకుంట గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. వివరాలు.. శేనగకుంట గ్రామానికి చెందిన మూడో తరగతి చదివే మంకిడి శృతిలయ(8), నాలుగో తరగతి చదివే యాలం శ్వేత(9)లు చెరువులో చేపల వేటకు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు వెళ్లారు. సాయంత్రం పనుల నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు పిల్లలు కనిపించలేదు. దీంతో వారి ఆచూకి కోసం గాలించారు. చెరువు వైపు వెళ్లినట్లు కొంత మంది గ్రామస్థులు చెప్పారు. ఈ క్రమంలో గ్రామస్థులు, కుటుంబసభ్యులు రాత్రి వేళ చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం అర్ధరాత్రి చెరువులో ఇద్దరు బాలికల శవాలను గ్రామస్థులు గుర్తించారు. దీంతో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి.
(మంగపేట)