నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి | Two children drown in pond | Sakshi
Sakshi News home page

నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

Nov 10 2015 5:46 PM | Updated on Apr 4 2019 4:44 PM

సంగెం మండలం పుటాన్ తండాలో విషాదం చోటుచేసుకుంది. ఊరికి సమీపంలో ఉన్న కుంట దగ్గరకు ఆడుకోవడానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తూ నీటిలో పడి మృతిచెందారు.

సంగెం (వరంగల్ జిల్లా) : సంగెం మండలం పుటాన్ తండాలో విషాదం చోటుచేసుకుంది. ఊరికి సమీపంలో ఉన్న కుంట దగ్గరకు ఆడుకోవడానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తూ నీటిలో పడి మృతిచెందారు. కార్తీక్(7), రాజు(10) అనే ఇద్దరు చిన్నారులు కుంటలో పడి మునిగిపోవడంతో పక్కనే ఉన్న మరో బాలుడు సిద్ధు భయంతో పారిపోయాడు. జరిగిన విషయాన్ని గ్రామానికి వెళ్లి వివరించాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న గ్రామస్తులు ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు.

Advertisement
 
Advertisement
Advertisement