
దుర్గమ్మ సన్నిధిలో తెలంగాణ స్పీకర్
ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ వారిని తెలంగాణ శాసనసభ స్పీకర్ దర్శించుకున్నారు.
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ వారిని తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసుధనాచారి సోమవారం దర్శించుకున్నారు. బెజవాడ దర్గమ్మ దర్శనానికి వచ్చిన స్పీకర్‌కు ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం స్పీకర్ మాట్లాడుతూ దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖఃసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.