ఈనెల 20న ఎంసెట్‌ నోటిఫికేషన్‌!  | TS EAMCET Notification Will Be Released On 20th February | Sakshi
Sakshi News home page

ఈనెల 20న ఎంసెట్‌ నోటిఫికేషన్‌! 

Feb 12 2020 8:36 AM | Updated on Feb 12 2020 8:53 AM

TS EAMCET Notification Will Be Released On 20th February - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశా ల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్‌) కమిటీ సమావేశాలు బుధవారం నుం చి మొదలు కానున్నాయి. ఒక్కొక్క సెట్‌ కమిటీ సమావేశాన్ని ఒక్కో రోజు నిర్వహించేందుకు సెట్స్‌ కన్వీనర్లు తేదీలు ఖరారు చేశారు. ఆయా సెట్స్‌కు సంబంధిత యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌ లర్‌ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. బుధవారం ఐసెట్, 17న ఎడ్‌సెట్, 19వ తేదీన పీఈ సెట్‌ సమావేశాలను నిర్వహించేందుకు చర్య లు చేపట్టనున్నాయి. ఇక ఎక్కువ మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఎంసెట్‌ కమిటీ సమావేశాన్ని ఈనెల 15న లేదా 18న నిర్వహించే అవకాశముంది. అదే రోజు ఈసెట్‌ కమిటీ స మావేశం కూడా నిర్వహించనున్నారు. ఆ తర్వా త లాసెట్‌ కమిటీ సమావేశం నిర్వహణకు చర్యలు చేపట్టనున్నారు. ఈ సమావేశాల్లో ఆ యా సెట్స్‌కు సంబంధించిన నోటిఫికేషన్ల జారీ తేదీలు, దరఖాస్తుల స్వీకరణ తేదీలను ప్రకటించనున్నారు. వాటితోపాటు అర్హతలు, ఇతర నిబంధనలను కూడా ఈ సమావేశాల్లో ఖరారు చేయనున్నారు. ఎంసెట్‌ నోటిఫికేషన్‌ను ఈ నెల 20 లేదా 21న జారీ చేసే అవకాశం ఉంది. 

మార్చి 2న పాలిసెట్‌ నోటిఫికేషన్‌ 
పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్‌–2020 నోటిఫికేషన్‌ను మార్చి 2వ తేదీన జారీ చేసేందుకు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్‌బీటీఈటీ) కసరత్తు చేస్తోంది. ఇందులో పరీక్ష ఫీజు, ఇతర నిబంధనలను, దరఖాస్తుల స్వీకరణ తేదీలను ప్రకటించనుంది. ఈ ప్రవేశ పరీక్షను ఏప్రిల్‌ 17వ తేదీన నిర్వహించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement