డిజిటల్‌ తెర.. ఓటర్లకు ఎర 

TRS, BJP Candidates Using Social Media In Election Campaign - Sakshi

వాట్సాప్, ఫేస్‌బుక్‌లతో వినూత్న ప్రచారం

పెరిగిన నెటిజన్లు 

పరస్పర దూషణలు

సాక్షి, ఆసిఫాబాద్‌టౌన్‌ : శాసన సభ సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు తమ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారం మరింత ముమ్మరం చేశారు. అందులో భాగంగా తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సోషల్‌ మీడియా హోరా హోరీగా పోస్టింగ్‌లను పెడుతున్నారు. వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరు, పాలనపరమైన అంశాలు, తెలంగాణ ఉద్యమానికి మూలమైన నీళ్లు, నిధులు, నియామకాలపై నిరంతరం నెటిజన్ల మధ్య త్రీవ స్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకుంటాన్నాయి. సోషల్‌ మీడియాలో నెటిజన్ల మధ్య ఇప్పటికే ఇలా పోటా పోటీ కొనసాగుతుండగా, తాజాగా ఎన్నికల తేదీ సమీపస్తుండటంతో సామాజిక మధ్యమాల్లో వాట్సాప్, ఫేసుబుక్‌లో పొలిటికల్‌ తారా స్థాయికి చేరుకుంది. కాగా ఏ మీడియాలో రాని అంశాలు కుడా సోషల్‌ మీడియాలో వస్తుండటంతో పార్టీల నాయకుల మధ్య సోషల్‌వార్‌ మరింత ఎక్కువైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఏడాది పెరిగిన సోషల్‌ ప్రచారం 

పెరిగిన నెటిజన్లు...
2014 సార్వత్రీక ఎన్నికలో పోల్చితే ఈ ఏడాది జరుగుతున్న ఎన్నికల్లో సోషల్‌ మీడియా ప్రచారం విపరీతంగా పెరిగింది. వెనుక బడిన జిల్లాలోని కోన్ని ప్రాంతల్లో ఒకప్పుడు ఫోన్‌ల వ్యవస్థనే లేదు. ల్యాండ్‌ ఫోన్‌లు ఉన్నా పలు మండలాల్లో సిగ్నల్‌ సరిగా ఉండకపోయేయి. కానీ టెలికాం రంగంలో సంస్థ అడుగుపెట్టాక దాదాపు అన్ని ప్రాంతలకు 4 జీ సిగ్నల్‌లు వచ్చేశాయి. 2014 సోషల్‌ మీడియా వాడుతున్న నెటిజన్లతో పోలిస్తే ఇప్పుడు సోషల్‌ మీడియా వాడుతున్న వారికి సంఖ్య డబుల్‌ అయింది. దీనికి మరో కారణం 2014 సంవత్సరంలో మెబుల్‌ నెట్‌ డాటా చార్జీలు అధికంగా ఉండటం. కాగా ఇప్పుడు 149 నుంచే ఆన్‌ లిమిటెడ్‌ సేవాలను ఆయా టెలికాం సంస్థలు అందిస్తున్నాయి. దీంతో ప్రతి పల్లేలోను 4 జీ ఇంటర్‌నెట్‌ సేవాలను వినియోగిస్తున్నారు. దీంతో రాజకీయ పార్టీలు తమ ప్రచారం ఎక్కువ మందికి చేరేలా తమ పార్టీల పెరిట వాట్సాప్‌ గ్రూప్‌లను ఏర్పాటు చేసి ప్రచారం కోనసాగిస్తుండగా ఇంక కోంతమంది ఫెసుబుల్‌ లైవ్‌ల ద్వారా ప్రతి నిత్యం తాము చేసే ప్రచారంను సోషల్‌ మీడియాలో పెడుతున్నారు. 

క్షణంలో అప్‌డేట్‌.. 
సాధరణ మీడియాకు ఏమాత్రం తీసిపోకుండా సోషల్‌మీడియాలో ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయి అంశాలతో పాటు,జిల్లా,నియోజక వర్గ,మండల,స్థానిక అంశాలను క్షణాలో అప్‌డేట్‌ చేసేలా ఆయా పార్టీలు చర్యలు చేపడుతున్నాయి. ఇందుకోసం నిరుద్యోగ యువకులకు 15 నుంచి 30 వేల వరకు వేతనం ఇస్తూ సోషల్‌ మీడియా ఇంచార్జ్‌లను నియామించుకున్నారు.వీరు అయా పార్టీల సభలు,సమావేశాలు,కార్యక్రమాలను సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా కార్యకర్తలకు అందించాలసిన సమాచారంను సైతం సోషల్‌ మీడియా వేదిక ద్వారా అందిస్తున్నారు. దీంతో సోషల్‌ మీడియాపై ఎటువంటి అవగాహన లేని పెద్ద తరం నాయకులు కుడా స్మార్ట్‌ ఫోనులను విధిగా వాడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా జిల్లాలోని రెండు నియోజకవర్గలో సైతం ప్రధాన పార్టీల నాయకులు ఆరోపణ,ప్రతి ఆరోపణలు చేసుకుంటు సోషల్‌ మీడియా ద్వారా ప్రత్యేక యుద్దాన్నే కోనసాగిస్తున్నారు. 

జోరందుకున్న ప్రచారం 
ప్రస్తుత డిజిటల్‌ ప్రపంచంలో ప్రజలకు తాము చెప్పదలిచిన అంశాలను తాము చేసిన సంక్షేమ కార్యక్రమాలు,గత ప్రభుత్వాలను ఎండగట్టేందుకు ఆయా పార్టీలు అన్ని రకాల విధానాలను వాడుకుంటున్నారు. జిల్లాలో ప్రధాన కూడళ్లలతో పాటు మారుమూల గ్రామల్లో రాత్రి సమయంలో ప్రత్యేక వాహనంలో ఏర్పాటు చేసిన డిజిటల్‌ తెరల ద్వారా తాము చెప్పదలుచుకున్నా విషయాలను నిరక్షరాస్యులతో పాటు అన్నివర్గాల ప్రజలకు అర్థమయ్యే రీతిలో తక్కువ సమయంలో విడమరిచి చెపుతున్నారు. దీనితో పాటు తమ పార్టీల అగ్ర నాయకుల స్పీచ్‌తో కూడిన వీడియోలను ప్రదర్శిస్తున్నారు. జిల్లాలో ముఖ్యంగా టీఆర్‌ఎస్, బీజేపీలు ఈ విధానాన్ని బాగా ఉపయోగించుకుంటున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top