కొత్తగూడెంలో గిరిజనుల భారీ ర్యాలీ | tribals rally in kothagudem over podu lands | Sakshi
Sakshi News home page

కొత్తగూడెంలో గిరిజనుల భారీ ర్యాలీ

Jun 12 2017 3:41 PM | Updated on Sep 5 2017 1:26 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో పోడు భూముల రక్షణ కోసం గిరిజనులు భారీ ర్యాలీ తీశారు.

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో పోడు భూముల రక్షణ కోసం సీపీఐ ఆధ్వర్యంలో గిరిజనులు, దళితులు కొత్తగూడెం మార్కెట్ యార్డు నుంచి  కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ తీశారు. కలెక్టర్ కార్యాలయం ముందు గిరిజనులతో కలిసి సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనులపై అటవీ శాఖ అధికారుల దౌర్జన్యాలు ఆపాలని డిమాండ్‌ చేశారు. ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్న పోడు భూములు గిరిజనులకే దక్కాలని, అధికారుల దాడులు ఆపాలని కోరారు.
 

Advertisement
 
Advertisement
Advertisement