ఏప్రిల్‌లోనే బదిలీలు నిర్వహించాలి | Transfers have to be done in April | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌లోనే బదిలీలు నిర్వహించాలి

Apr 1 2017 1:01 AM | Updated on Aug 9 2018 4:51 PM

ఏప్రిల్‌లోనే బదిలీలు నిర్వహించాలి - Sakshi

ఏప్రిల్‌లోనే బదిలీలు నిర్వహించాలి

ఉద్యోగుల బదిలీలు సాధ్యమైనంత త్వరగా ఈ ఏప్రిల్‌లో నిర్వహించాలని టీఎన్జీవోస్‌ కేంద్ర సంఘం గౌరవ అధ్యక్షులు దేవీప్రసాద్‌ కోరారు.

టీఎన్జీవోస్‌ గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్‌

నాగారం (నిజామాబాద్‌ అర్బన్‌): ఉద్యోగుల బదిలీలు సాధ్యమైనంత త్వరగా ఈ ఏప్రిల్‌లో నిర్వహించాలని టీఎన్జీవోస్‌ కేంద్ర సంఘం గౌరవ అధ్యక్షులు దేవీప్రసాద్‌ కోరారు. అలాగే, ఉద్యోగులకు పెన్షన్‌ సాధించే వరకు పోరాటాలు చేద్దామ ని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం నిజామాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఉద్యోగుల ప్రమేయం లేకుండా పోస్టిం గులు ఇచ్చారని, అవి తాత్కాలిక కేటాయింపులని చెప్పినా ఇంకా బదిలీలు చేయకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే ఉద్యోగుల బదిలీలు నిర్వహించాలని కోరారు.

ఉద్యోగుల పెన్షన్‌ విధానం కోసం త్వర లోనే ఈ ఏప్రిల్‌లో 28, 29న జాతీయ సమ్మేళ నాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పెన్షన్‌ విధానం కోసం రాష్ట్ర, జాతీయస్థాయిలో రాజీలేని పోరాటాలు చేయాల్సిందే అన్నారు. ఉద్యోగుల పెన్షన్‌ విధానానికి  ఎంపీ కవిత కేంద్రానికి లేఖ రాశారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement