లా సెట్కు అన్ని ఏర్పాట్లు పూర్తి | Tomorrow laset | Sakshi
Sakshi News home page

లా సెట్కు అన్ని ఏర్పాట్లు పూర్తి

May 23 2016 8:55 AM | Updated on Sep 4 2017 12:41 AM

మూడు, ఐదేళ్ల లాసెట్‌తోపాటు ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 24న లాసెట్-2016 నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ ఎంవీ రంగారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

కేయూ క్యాంపస్: మూడు, ఐదేళ్ల లాసెట్‌తోపాటు ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 24న లాసెట్-2016 నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ ఎంవీ రంగారావు ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ ప్రవేశ పరీక్షకు 13,323, ఐదేళ్ల కోర్సుకు 4,104, ఎల్‌ఎల్‌ఎం పరీక్షకు 1,793 మంది హాజరు కానున్నట్లు వివరించారు.

ఎల్‌ఎల్‌బీ ప్రవేశ పరీక్ష బుధవారం ఉదయం 10-11.30 గంటల వరకు, ఎల్‌ఎల్‌ఎం ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. నిర్దేశిత సమయానికి నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించబోమన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా 14 రీజనల్ సెంటర్ల పరిధిలో 37 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement