breaking news
LLM course
-
తెలంగాణ లాసెట్ ఫలితాలు వచ్చేశాయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లా సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి బుధవారం మధ్యాహ్నం రిజల్ట్స్‌ను విడుదల చేశారు. సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ ఒక్క క్లిక్‌తోనే లాసెట్ ఫలితాలను అందిస్తోంది.ఎల్ఎల్బీ(ఐదు, మూడేళ్ల కోర్సు)తోపాటు ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశాల కోసం లాసెట్, పీజీఎల్‌సెట్ ఫలితాలు (Telangana LAW CET 2025 Results) నిర్వహిస్తారని తెలిసిందే. జూన్ 6న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాసెట్, పీజీ ఎల్సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది లాసెట్‌కు మొత్తంగా 57,715 మంది దరఖాస్తు చేసుకోగా.. 45,609 మంది హాజరయ్యారు. మూడేళ్ల ఎల్ఎల్బీకి 32,118 మంది, ఐదేళ్ల ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎంకు 13,491 మంది చొప్పున అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు. ఇటీవల కీ విడుదల చేసిన అధికారులు తాజాగా ఫలితాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.👉ఫలితాల కోసం క్లిక్ చేయండిబాలకిష్ట రెడ్డి ఉన్నత విద్యా మండలి చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ.. లా సెట్ , పీజీ లా సెట్ ఫలితాలు విడుదల చేశాం. ఈసారి లా సెట్, పీజీ లా సెట్ లో 66.46 శాతం మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. గత ఏడాదితో పోలిస్తే తగ్గిన లా సెట్, పీజీ లా సెట్ పాస్ పర్సంటేజ్ తగ్గింది. కానీ, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 31 లా కాలేజీల్లో 9,388 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సారి కొత్తగా శాతవాహన, పాలమూరు యూనివర్సిటీ లో కొత్తగా లా తరగతులు ప్రారంభిస్తున్నాం అని తెలిపారాయన. -
పరీక్ష రాసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
సాక్షి, హన్మకొండ: ప్రజాప్రతినిధిగా గెలుపొంది.. శాసనసభలో అడుగుపెట్టినా.. ఆయన చదువును మాత్రం ఆపలేదు. దూరవిద్యలో న్యాయశాస్త్రాన్ని అభ్యసిస్తూ.. క్రమం తప్పకుండా సెమిస్టర్ పరీక్షలకు హాజరవుతున్నారు. తాజాగా తోటి విద్యార్థులతో కలిసి ఆయన హన్మకొండ సుబేదారిలోని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లాలో పరీక్షలు రాశారు. ఆయనే ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి. హన్మకొండలోని ఆదర్శ్ లా కాలేజీలో జీవన్‌రెడ్డి ఎల్ఎల్ఎం అభ్యసిస్తున్నారు. ఎల్ఎల్ఎం విద్యలో భాగంగా ఆయన ప్రస్తుతం మూడో సెమిస్టర్ పరీక్షలకు హాజరవుతున్నారు. సోమవారం పరీక్ష రాసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఏడాది రెండు సెమిస్టర్ పరీక్షలు రాసి పాసయ్యానని, ఈ రోజు మూడో సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యానని తెలిపారు. పరీక్షలకు హాజరుకావడం చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసిందని, పదో తరగతి, ఇంటర్ పరీక్షలు గుర్తుకువచ్చాయని అన్నారు. -
లా సెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి
కేయూ క్యాంపస్: మూడు, ఐదేళ్ల లాసెట్తోపాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 24న లాసెట్-2016 నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ ఎంవీ రంగారావు ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడేళ్ల ఎల్ఎల్బీ ప్రవేశ పరీక్షకు 13,323, ఐదేళ్ల కోర్సుకు 4,104, ఎల్ఎల్ఎం పరీక్షకు 1,793 మంది హాజరు కానున్నట్లు వివరించారు. ఎల్ఎల్బీ ప్రవేశ పరీక్ష బుధవారం ఉదయం 10-11.30 గంటల వరకు, ఎల్ఎల్ఎం ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. నిర్దేశిత సమయానికి నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించబోమన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా 14 రీజనల్ సెంటర్ల పరిధిలో 37 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.