తెలంగాణ లాసెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌ | TS LAWCET, PGLCET 2025 Results Released Check With Click Here | Sakshi
Sakshi News home page

తెలంగాణ లాసెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌, ఒక్క క్లిక్‌తో చెక్‌ చేస్కోండిలా..

Jun 25 2025 4:12 PM | Updated on Jun 25 2025 4:57 PM

TS LAWCET, PGLCET 2025 Results Released Check With Click Here

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో లా సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డి బుధవారం మధ్యాహ్నం రిజల్ట్స్‌ను విడుదల చేశారు. సాక్షి ఎడ్యుకేషన్‌ డాట్‌ కామ్‌ ఒక్క క్లిక్‌తోనే లాసెట్‌ ఫలితాలను అందిస్తోంది.

ఎల్‌ఎల్‌బీ(ఐదు, మూడేళ్ల కోర్సు)తోపాటు ఎల్‌ఎల్‌ఎం కోర్సులో ప్రవేశాల కోసం లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ ఫలితాలు (Telangana LAW CET 2025 Results) నిర్వహిస్తారని తెలిసిందే. జూన్‌ 6న  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాసెట్‌, పీజీ ఎల్‌సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది లాసెట్‌కు మొత్తంగా 57,715 మంది దరఖాస్తు చేసుకోగా.. 45,609 మంది హాజరయ్యారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీకి 32,118 మంది, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎంకు 13,491 మంది చొప్పున అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు. ఇటీవల కీ విడుదల చేసిన అధికారులు తాజాగా ఫలితాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

👉ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

బాలకిష్ట రెడ్డి ఉన్నత విద్యా మండలి చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ.. లా సెట్ , పీజీ లా సెట్ ఫలితాలు విడుదల  చేశాం. ఈసారి లా సెట్, పీజీ లా సెట్ లో 66.46 శాతం మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. గత ఏడాదితో పోలిస్తే తగ్గిన లా సెట్, పీజీ లా సెట్ పాస్ పర్సంటేజ్  తగ్గింది. కానీ, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 31 లా కాలేజీల్లో 9,388 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సారి కొత్తగా శాతవాహన, పాలమూరు యూనివర్సిటీ లో కొత్తగా లా తరగతులు ప్రారంభిస్తున్నాం అని తెలిపారాయన. 

Advertisement
 
Advertisement
Advertisement