breaking news
ts law cet
-
తెలంగాణ లాసెట్ ఫలితాలు వచ్చేశాయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లా సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి బుధవారం మధ్యాహ్నం రిజల్ట్స్‌ను విడుదల చేశారు. సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ ఒక్క క్లిక్‌తోనే లాసెట్ ఫలితాలను అందిస్తోంది.ఎల్ఎల్బీ(ఐదు, మూడేళ్ల కోర్సు)తోపాటు ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశాల కోసం లాసెట్, పీజీఎల్‌సెట్ ఫలితాలు (Telangana LAW CET 2025 Results) నిర్వహిస్తారని తెలిసిందే. జూన్ 6న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాసెట్, పీజీ ఎల్సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది లాసెట్‌కు మొత్తంగా 57,715 మంది దరఖాస్తు చేసుకోగా.. 45,609 మంది హాజరయ్యారు. మూడేళ్ల ఎల్ఎల్బీకి 32,118 మంది, ఐదేళ్ల ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎంకు 13,491 మంది చొప్పున అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు. ఇటీవల కీ విడుదల చేసిన అధికారులు తాజాగా ఫలితాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.👉ఫలితాల కోసం క్లిక్ చేయండిబాలకిష్ట రెడ్డి ఉన్నత విద్యా మండలి చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ.. లా సెట్ , పీజీ లా సెట్ ఫలితాలు విడుదల చేశాం. ఈసారి లా సెట్, పీజీ లా సెట్ లో 66.46 శాతం మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. గత ఏడాదితో పోలిస్తే తగ్గిన లా సెట్, పీజీ లా సెట్ పాస్ పర్సంటేజ్ తగ్గింది. కానీ, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 31 లా కాలేజీల్లో 9,388 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సారి కొత్తగా శాతవాహన, పాలమూరు యూనివర్సిటీ లో కొత్తగా లా తరగతులు ప్రారంభిస్తున్నాం అని తెలిపారాయన. -
టీఎస్ లాసెట్-2015 ఫలితాలు విడుదల
మూడేళ్ల లా కోర్సులో 85.20% ఉత్తీర్ణత ఐదేళ్ల లా కోర్సులో 82.87 % ఎల్ఎల్ఎం పీజీ సెట్లో 95.95% కేయూక్యాంపస్: తెలంగాణ రాష్ట్రంలోని ఎల్ఎల్బీ మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సులు, ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశాలకు గత నెల 19న నిర్వహించిన టీఎస్ లాసెట్, టీఎస్ పీజీ సెట్ ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. కాకతీయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు ఫలితాల సీడీలను విడుదల చేశారు. కేయూ ఆధ్వర్యంలో నిర్వహించిన లాసెట్ మూడేళ్ల కోర్సులో 13,507 మంది అభ్యర్థులకు గాను 11,680 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 9,951మంది అభ్యర్థులు ఉత్తీర్ణత (85.20 శాతం) సాధించారు. పురుషుల విభాగంలో 9,324 మంది పరీక్షకు హాజరుకాగా, 8,165 మంది ఉత్తీర్ణత (87.57శాతం) పొందారు. మహిళల విభాగంలో 2,356 మంది పరీక్షకు హాజరు కాగా, 1,786 మంది (75.81శాతం) ఉత్తీర్ణులయ్యూరు. ఐదేళ్ల లా కోర్సులో...: ఐదేళ్ల లాకోర్సులో 4,257మంది అభ్యర్థులకు 3,695 మంది పరీక్షకు హాజరుకాగా... ఇందులో 3,062 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత (82.87 శాతం) సాధించారు. పురుషుల విభాగంలో 85.65శాతం, మహిళల విభాగంలో 73.88 శాతం ఉత్తీర్ణత పొందారు. పీజీ లా సెట్లో...: ఎల్ఎల్ఎం పీజీ సెట్లో రాష్ట్రవ్యాప్తంగా రెండు రీజియన్ల సెంటర్ల పరిధిలో (హైదరాబాద్, వరంగల్ ) 1,584 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా, 1,328 మంది ఉత్తీర్ణత (95.95 శాతం) సాధించారు. పురుషుల విభాగంలో 96.01 శాతం, మహిళల విభాగంలో 95.80 శాతం ఉత్తీర్ణులయ్యూరు. పీజీ లాసెట్‌లో హైదరాబాద్‌కు చెందిన జీవీ.సుబ్రమణ్యన్ 79 మార్కులతో రెండో ర్యాంకు సాధించారు. ఆయన 60 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించడం విశేషం. అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సు, ఎల్ఎల్ఎం పీజీసెట్‌కు అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను జూలై 20న విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి వెల్లడించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జూలై 26 నుంచి 29 వరకు ఉంటుందన్నారు. లాసెట్ ఫలితాల్లో మూడేళ్లు, ఐదేళ్ల, ఎల్ఎల్ఎం పీజీ సెట్లో ర్యాంకులు సాధించినవారు లాసెట్ మూడేళ్ల కోర్సులో... పేరు ర్యాంక్ మార్కులు వీజీ.సతీష్ పసుమర్తి, రంగారెడ్డి 1 102 చంద్రశేఖర్ ఆర్, కరీంనగర్ 2 101 దేవేందర్‌రెడ్డి తిరుగుడు, నల్లగొండ 3 98 లాసెట్ ఐదేళ్ల కోర్సులో ర్యాంకర్లు.... సుదగాని రాజు, నల్లగొండ 1 101 లకమ్ నర్సింహ రావు, నల్లగొండ 2 99 రాంబాబు మోటె, నల్గొండ 3 97 ఎల్ఎల్ఎం పీజీసెట్‌లో ర్యాంకర్లు... రజత్ బెనర్జీ, రంగారెడ్డి 1 83 జి.వి సుబ్రమణ్యం, హైదరాబాద్ 2 79 మిధున్ కుమార్ ఎ, రంగారెడ్డి 3 76