breaking news
Professor mv Ranga Rao
-
లా సెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి
కేయూ క్యాంపస్: మూడు, ఐదేళ్ల లాసెట్తోపాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 24న లాసెట్-2016 నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ ఎంవీ రంగారావు ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడేళ్ల ఎల్ఎల్బీ ప్రవేశ పరీక్షకు 13,323, ఐదేళ్ల కోర్సుకు 4,104, ఎల్ఎల్ఎం పరీక్షకు 1,793 మంది హాజరు కానున్నట్లు వివరించారు. ఎల్ఎల్బీ ప్రవేశ పరీక్ష బుధవారం ఉదయం 10-11.30 గంటల వరకు, ఎల్ఎల్ఎం ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. నిర్దేశిత సమయానికి నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించబోమన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా 14 రీజనల్ సెంటర్ల పరిధిలో 37 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. -
కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ రాజీనామా?
ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని ప్రశ్నించిన సంఘాలు అబ్జర్వర్ల డ్యూటీలు వేయాలంటూ మరికొందరి ఒత్తిళ్లు ఇన్చార్జి రిజిస్ట్రార్, ఫైనాన్స్ ఆఫీసర్‌కు మధ్య విభేదాలు కేయూక్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవీ రంగారావు తన పదవికి శుక్రవారం రాజీనామా చేసినట్లు తెలిసింది. తాను రాజీ నామా చేస్తున్నట్లు ఆయన ఉద్యోగ సంఘాల సమక్షంలో చెప్పి యూనివర్సిటీ ఇన్చార్జి వీసీ కె.వీరారెడ్డిని కలవడం కలకలం సృష్టించింది. యూనివర్సిటీలోని అన్ని కేట గిరీల ఉద్యోగాల్లో ఎంతమంది పనిచేస్తున్నారో తెలియజేయాలని ఇటీవల ప్రభుత్వం ఓ ప్రొఫార్మాను పంపి వివరాలను అందజేయూలని ఆదేశించిన విషయం తెలి సిందే. అంతేగాక యూనివర్సిటీ టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగులకు వేతనాల కోసం ఇచ్చే బ్లాక్గ్రాంటు నిధులు రాలేదు. ఫలితంగా ఫిబ్రవరికి సం బంధించిన వేతనాలను సకాలంలో ఇవ్వలేకపోయారు. తర్వాత యూనివర్సిటీ కళాశాలల్లోని వివిధ విభాగాల నుంచి అంతర్గత నిధులు సమీకరించి కొందరికి వేతనాలు ఇచ్చినప్పటికీ ఇంకా కొందరి ఉద్యోగులకు వేతనాలివ్వలేదు. ఈ క్రమంలోనే శుక్రవారం వివిధ ఉద్యోగ సంఘాల బాధ్యు లు యూనివర్సిటీ ప్రిన్సిపాల్ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని ఇన్చార్జీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రంగారావును ప్రశ్నించారు. దీంతో తాను ఇప్పటికే వేతనాలు ఇవ్వాలని కేయూ ఫైనాన్స్ ఆఫీసర్ రమేష్‌కుమార్‌ను కోరానని సమాధానమిచ్చారు. అయితే యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ కార్యాలయం నుంచి రావాల్సిన నిధు లు రాకపోవడంతోనే వేతనాలు ఇవ్వలేకపోతున్నట్లు ఫైనాన్స ఆఫీసర్ చెబుతున్నట్లు రంగారావు పేర్కొన్నా రు. తాను కూడా యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌కు లేఖను కూడా పెట్టానన్నారు. దీంతో మిగతా ఉద్యోగులకు ఎలాగైతే వేతనాలు ఇచ్చారో వీరికి కూడా వేతనాలు యూనివర్సిటీయే ఇవ్వాలని వివిధ ఉద్యోగ సంఘాల బాధ్యులు ఇన్చార్జీ రిజిస్ట్రార్‌తో వాగ్వాదానికి దిగారు. ఇప్పటికే అనేక సమస్యలున్నాయని, అబ్జర్వర్ల డ్యూటీల కోసం కూడా కొందరు తనపై ఒత్తిడి చేస్తూ ఆందోళనకు గురిచేస్తున్నారని ఇన్చార్జీ రిజిస్ట్రార్ వారితో వాపోయూ రు. తనకు ఆరోగ్యం కూడా సహకరించటం లేదన్నారు. ఆ వెంటనే తాను ఇన్చార్జీ రిజిస్ట్రార్ పదవికి రాజీనామా చేస్తానని అక్కడికక్కడే ఓ లేఖ రాసి అక్కడనున్న సిబ్బం ది ఒకరికి టైప్ చేయాలని సూచించారు. అదే సమయంలోనే అకౌంట్స్ విభాగం నుంచి పంపాల్సిన డాటా విషయమై ఆయనకు కేయూ ఇన్చార్జి వీసీ వీరారెడ్డి ఫోన్ చేయగా తాను రాజీనామా చేస్తున్నట్లు రంగారావు చెప్పారు. ఆ తర్వాత తనచాంబర్ నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయా రు. నేరుగా ఇన్ చార్జి వీసీ వద్దకు వెళ్లి రాజీనామా పత్రం సమర్పించినట్లు తెలిసింది. శుక్రవారం రాత్రి కేయూ ఇన్చార్జి వీసీ వీరారెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా తనకు రంగారావు రాజీ నామా లేఖ అందలేదని, ఫోన్లో చెప్పగా వద్దని వారించినట్లు సమాధానమిచ్చారు. స్పందించని యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ గ్రాంటు ఇవ్వటంలో జాప్యం చేసింది. దీంతో ప్రభుత్వ సూచన మేరకు అంతర్గత నిధుల సేకరణకు ఇన్చార్జీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రంగారావు యూనివర్సిటీ కాలేజీలకు, పరీక్షల విభాగానికి, అడ్మిషన్ల డెరైక్టరేట్‌కు, దూరవిద్యాకేంద్రానికి లేఖలు రాశారు. యూనివర్సిటీల కాలేజీల వద్ద ఉన్న ట్యూషన్ ఫీజుల నిధులను ఇవ్వాలని కోరగా అందులో యూనివర్సిటీ అడ్మిషన్ల డెరైక్టరేట్ నుంచి రూ. కోటి, పరీక్షల విభా గం నుంచి రూ.కోటి, ఫార్మసీ కాలేజీ నుంచి రూ.5 లక్ష లు, ఆర్ట్స్ కాలేజీ నుంచి రూ.22 లక్షలు ఇచ్చారు. అయితే ఈ నెల 12 వరకు యూనివర్సిటీ కాలేజి ప్రిన్సిపాల్ కార్యాలయం నుంచి ట్యూషన్ ఫీజులు పంపలేదు. దీం తో ఆ కార్యాలయ ఉద్యోగులకు వేతనాలిచ్చేందుకు ఫైనాన్స్ ఆఫీసర్ రమేష్‌కుమార్ నిరాకరించారు. నిధులేమి ఉందని ప్రిన్సిపాల్‌కు చెప్పినా ఇవ్వనప్పుడు వేతనాలు ఎలా ఇస్తారని నిరాకరించినట్లు రమేష్‌కుమార్ వాదన. ఏ కాలేజీలైతే నిధులు ఇస్తాయో.. ఆ కాలేజీ సిబ్బందికి వేతనాలు ఇస్తున్నామనేది ఆయన వాదన. ఇన్చార్జి రిజిస్ట్రార్ రాజీ నామా చేసినట్లు చెప్పి వెళ్లిపోయాక, నిధుల వ్యవహారం పై చర్చతో ప్రిన్సిపాల్ రూ.25 లక్షల చెక్ పంపడం కొసమెరుపు. రూ.7.70 కోట్లు బ్లాక్ గ్రాంట్ మంజూరు కేయూకు ఎట్టకేలకు ప్రభుత్వం శుక్రవారం రూ.7 కోట్ల 70 లక్షలు బ్లాక్ గ్రాంటు నిధులు మం జూరు చేసింది. గతంలో రూ.17 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ప్రతినెలా రూ 6.50 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు టీచింగ్, నాన్‌టీచింగ్, పార్ట్‌టైం, కాంట్రాక్ట్, కొందరు తాత్కాలిక, టైంస్కేల్, లం ప్సమ్ ఉద్యోగుల వేతనాలకు అవస రం అవుతుండగా 2 నెలల కోసం ప్రస్తుతం రూ.7.70 కోట్లు మంజూరయ్యాయి. దీంతో కొంత ఊరట కలిగినట్లయింది. ఏటా రూ.83 కోట్లకుపైగా నిధులు అవసరమవుతుండగా ప్రభుత్వం నుంచి రూ 47.88 కోట్లు మాత్రమే బ్లాక్గ్రాంటు నిధులు వస్తున్నాయి.