ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను ఆదివారం వేకువ జామున అటవీ అధికారులు పట్టుకున్నారు.
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను ఆదివారం వేకువ జామున అటవీ అధికారులు పట్టుకున్నారు. పోచంపాడు అటవీ ప్రాంతం నుంచి డీసీఎం వాహనంలో దుండగులు కలపను తరలిస్తుండగా కనాపూర్ మండలం బురుజు గ్రామ శివారులో అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న కలప విలువ రూ. .5 లక్షలుగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
(ఖానాపూర్)