నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం రామారెడ్డిలో అటవీశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం రామారెడ్డిలో అటవీశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండలంలోని పలు టింబర్ డిపోలపై అధికారులు దాడి చేశారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 100 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.