పిడుగుపాటుకు రైల్వే వ్యవస్థ అతలాకుతలమైంది.
కరీంనగర్: పిడుగుపాటుకు రైల్వే వ్యవస్థ అతలాకుతలమైంది. సిగ్నల్ పై పిడుగుపడటంతో.. సిగ్నల్ వ్యవస్థ అస్తవ్యస్థమైంది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి సమీపంలో సోమవారం తెల్లవారుజామున రైల్వే సిగ్నల్‌పై పిడుగుపడింది. దీంతో ఏపీ సంపర్క్‌క్రాంతి సూపర్ ఫాస్ట్‌తో పాటు స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం పెద్దపల్లి రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయాయి.
భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను రాఘవపూర్ సమీపంలో రెండు గంటల నుంచి నిలిపి ఉంచడంతో.. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించేందుకు యత్నిస్తున్నారు.