సకాలంలో పనులు పూర్తిచేయండి: తుమ్మల

Thummala Nageshwar Rao on Land Acquisition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో చేపడుతున్న జాతీయ రహదారుల విస్తరణ పనులను గడువులోగా పూర్తి చేయాలని రోడ్లు భవనాల అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. సోమవారం ఆయన తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో జాతీయ రహదారుల నిర్మాణం, భూసేకరణ పనులపై చర్చించారు. భూసేకరణను సకాలంలో పూర్తి చేసి, ఆయా భూములను నిర్మాణ సంస్థలకు అప్పగించాలని సూచించారు.

ఖమ్మం–దేవరపల్లి భూసేకరణ, ఖమ్మం–వరంగల్‌ విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మంచిర్యాల–వరంగల్‌–కంచికచర్ల రహదారిని గ్రీన్‌ఫీల్డ్‌ అలైన్‌మెంట్‌ పరిధిలో చేర్చినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోడ్డు విస్తరణ ప్రతిపాదనలను సమర్పించాలన్నారు. ఖమ్మం–కోదాడ, ఖమ్మం–సూర్యాపేట రహదారు ల పనులకు టెండర్లు పిలవాలన్నారు. సమావేశంలో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ పీడీ దుర్గా ప్రసాద్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top