రెప్పపాటులో ఘోరం | three people died in road Accident | Sakshi
Sakshi News home page

రెప్పపాటులో ఘోరం

Mar 11 2015 11:49 PM | Updated on Aug 30 2018 3:56 PM

రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. మితిమీరిన వేగం..లారీడ్రైవర్ నిర్లక్ష్యానికి ముగ్గురు బలైపోగా..మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు..

ఆలేరు:రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. మితిమీరిన వేగం..లారీడ్రైవర్ నిర్లక్ష్యానికి ముగ్గురు బలైపోగా..మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు..ఆలేరులో బుధవారం చోటుచేసుకున్న ప్రమాదానికి లారీడ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
 
 అంత్యక్రియలకు వెళ్తూ..
 వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి చెందిన నల్ల దేవదానం మృతిచెందాడు. ఇతడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బంధువులైన హైదరాబాద్‌లోని హ బ్సీగూడలో నివాసముంటున్న ఎనిమిది మంది ఉదయం ఇన్నోవా వాహనంలో బయలుదేరారు. భువనగిరిలోని ఓ హోటల్‌లో అల్పహారం తీసుకున్నారు. ఆలేరులోని సాయిబాబా ఆలయాన్ని దాటిన తరువాత ఈదుల వాగు సమీపంలో వరంగల్ నుంచి హైదరాబాదు వైపునకు ఖాళీ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీ ముందున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయబోయి ఇన్నోవాను ఎదురుగా ఢీకొట్టింది. దీంతో ఇన్నోవా వాహనంలో ప్రయాణిస్తున్న రొడ్ల యశోద(40), రొడ్ల శాంతమ్మ(60), వాహన డ్రైవర్ బుర్గుల రాజు (28) అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవర్ స్వస్థలం మెదక్ జిల్లా కొండపాక మండలం విశ్వానాథపల్లి గ్రామం ఇదే ఘటనలో ఇన్నోవా వాహనంలో ప్రయాణిస్తున్న రొడ్ల వెంకటేశ్, ఈదుల పుష్పలత, వనజ, భూపతి రాములు, రొడ్ల నర్సింగరావు,బోనగిరి పద్మకు తీవ్ర గాయాలయ్యాయి.
 
 మిన్నంటిన ఆర్తనాదాలు
 ప్రమాదంలో ఖాళీ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీ రోడ్డుపై బోల్తా కొట్టగా, ఇన్నోవా వా హనం నుజ్జునుజ్జు అయ్యింది.  డ్రైవర్ రాజు, యశోదలు ఇన్నోవాలోనే ఇరుక్కుపోయి మృతిచెందారు. శాంతమ్మ ఎగిరి రోడ్డుపై పడి ఊపిరి వదిలింది. కాగా, ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు రక్షించండి..రక్షించండి అం టూ చేసిన ఆర్తనాదాలు మిన్నం టా యి. మృతదేహాలను వాహనం నుంచి బయటకు తీసేందుకు పోలీ సులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపైనే వాహనాలు పడిపోవడంతో ట్రాఫిక్‌కు  అంతరాయం కలిగింది.
 
 ‘గాంధీ’కి క్షతగాత్రుల తరలింపు
 ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని 108 వాహనంలో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అ క్క డ వారిని ప్రాథమిక చికిత్స చేయిం చిన తరువాత సికింద్రాబాద్‌లోని గాం ధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా, ప్రమాదానికి కారణమైన లారీడ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రమాదస్థలా న్ని యాదగిరిగుట్ట సీఐ మాదాసు శంకర్‌గౌడ్, భువనగిరి ఆర్డీఓ మధుసూదన్, తహసీల్దార్ రామ్మూర్తిలు సందర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement