నా జీవితానికి ఈ విజయం చాలు.. ఇంకేమీ అక్కర్లేదు! | this triumph is enough for my life time, says kcr | Sakshi
Sakshi News home page

నా జీవితానికి ఈ విజయం చాలు.. ఇంకేమీ అక్కర్లేదు!

Apr 27 2015 7:50 PM | Updated on Apr 7 2019 3:35 PM

నా జీవితానికి ఈ విజయం చాలు.. ఇంకేమీ అక్కర్లేదు! - Sakshi

నా జీవితానికి ఈ విజయం చాలు.. ఇంకేమీ అక్కర్లేదు!

తెలంగాణ రాష్ట్రం సాధించానన్న విజయం ఒక్కటీ తన జీవితానికి చాలని, ఇంకేమీ అవసరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు.

తెలంగాణ రాష్ట్రం సాధించానన్న విజయం ఒక్కటీ తన జీవితానికి చాలని, ఇంకేమీ అవసరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో సోమవారం రాత్రి జరిగిన పార్టీ 14వ ఆవిర్భావ సమావేశంలో ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
 

  • పక్క రాష్ట్రంలో మీడియా మేనేజ్మెంట్ తప్ప మరేమీ లేదు.
  • నేను మాత్రం ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవరకు విశ్రమించేది లేదు.
  • మీరంతా పెద్ద ఎత్తున లక్షలాదిగా తరలి వచ్చారు.. అందరికీ ధన్యవాదాలు
  • అందరూ వచ్చినందుకు సంతోషం. టీఆర్ఎస్ అంటే ఏందో, తెలంగాణ ప్రజల ఐక్యత ఏందో నిరూపించారు
  • అందరికీ ఒక్కటే మనవి.. అందరినీ సురక్షితంగా ఇళ్లకు చేర్చాలి. అతివేగంతో పోవద్దు
  • చివరిగా ఒక్కటే మాట..
  • హైదరాబాద్ నగరాన్ని హైటెక్ చేసినమంటారు
  • ఇక్కడ తాగేందుకు మంచినీళ్లు లేవు, మౌలిక సదుపాయాల్లేవు
  • చిన్న వర్షం పడిందంటే నీళ్లన్నీ రోడ్లమీదే ఉంటాయి... ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ లు.
  • ఇది విశ్వనగరంగా రూపొందాలి. అమెరికాలోని డల్లస్ను తలదన్నే రీతిలో, సింగపూర్ లాంటి నగరాల్లా తీర్చిదిద్దుతానని మాట ఇస్తున్నా
  • జంట నగరాలను రాబోయే మూడు, మూడున్నరేళ్లలో అద్భుతంగా తీర్చిదిద్ది మీకు బహుమానంగా అందిస్తా.
  • నా జీవితానికి ఇప్పటికి సాధించిన విజయం చాలు.. మరే కొత్త విజయాలూ అవసరం లేదు
  • ఈ తెలంగాణ గుంటనక్కల పాలు కావద్దు.. ఇది బంగారు తెలంగాణ కావాలి
  • అందరూ చిరునవ్వుతో ఉండే తెలంగాణ కావాలి.. నాకు వేరే పనిలేదు
  • 24 గంటలూ ఇదే పని చేసి మీకల సాకారం చేస్తా.. జై తెలంగాణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement