గవర్నర్ నరసింహన్ దంపతులు గురువారం ఉదయం ప్రత్యేక హెలికాప‍్టర్‌లో భద్రాచలం చేరుకున్నారు.
భద్రాచలం చేరుకున్న గవర్నర్ దంపతులు
Apr 6 2017 9:58 AM | Updated on Aug 21 2018 11:49 AM
భద్రాచలం: గవర్నర్ నరసింహన్ దంపతులు గురువారం ఉదయం ప్రత్యేక హెలికాప‍్టర్‌లో భద్రాచలం చేరుకున్నారు. గవర్నర్ దంపతులకు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్, ఎస్పీ స్వాగతం పలికారు. మిథిలా స్టేడియంలో వైభవంగా జరగనున్న శ్రీరాముడి మహాపట్టాభిషేకం కార్యక్రమంలో గవర‍్నర్ దంపతులు పాల్గొననున్నారు.
ఇప్పటికే భక్తులు కూడా భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. ఇటు గవర్నర్ దంపతులు, అటు భక్తులు భారీగా వస్తున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
Advertisement
Advertisement