కోరుట్ల ఎస్‌బీహెచ్‌లో చోరీకి యత్నం | theft trial in korutla sbh in karimanagar district | Sakshi
Sakshi News home page

కోరుట్ల ఎస్‌బీహెచ్‌లో చోరీకి యత్నం

Dec 5 2015 6:33 PM | Updated on Sep 3 2017 1:33 PM

కరీంనగర్ జిల్లా కోరుట్లలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ శాఖలో దుండగులు చోరీకి యత్నించారు.

కోరుట్ల: కరీంనగర్ జిల్లా కోరుట్లలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ శాఖలో దుండగులు చోరీకి యత్నించారు. శుక్రవారం అర్ధరాత్రి షట్టర్ల తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడిన దొంగలు లాకర్లను తెరిచేందుకు ప్రయత్నించారు. వారివల్ల కాకపోవడంతో వెళ్లిపోయారు. తిరిగి వెళుతూ సీసీ కెమెరాల పరికరాలను ఎత్తుకుపోయారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి శనివారం కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement