వరంగల్ ఉప పోరులో మొత్తం 69.19 శాతం పోలింగ్ నమోదయింది.
హన్మకొండ అర్బన్ : వరంగల్ ఉప పోరులో మొత్తం 69.19 శాతం పోలింగ్ నమోదయింది. ఇందులో పురుషుల కంటే మహిళలే 0.31 శాతం ఎక్కువగా పోలింగ్‌లో పాల్గొనడం విశేషం. లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో 15,09,671 ఓట్లు ఉండగా, ఇందులో పురుషులు 7, 57, 231 మంది, మహిళలు 7, 52, 293 మంది, ఇతరులు(థర్డ్ జండర్) 157 మంది ఉన్నారు. మొత్తం 10,35,656 ఓట్లు పోలయ్యాయి.
నాలుగు నియోజకవర్గాల్లో మహిళలే అధికం..
వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, వరంగల్ తూర్పు, భూపాలపల్లి సెగ్మెంట్లలో మహిళా ఓటింగ్ శాతమే ఎక్కువగా ఉంది. జిల్లా మొత్తం 69.19 శాతం పోలింగ్ నమోదు కాగా, పురుషులు 68.45 శాతం, మహిళలు 68.76 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.