రైతు ఆత్మహత్య | The farmer commits suicide | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్య

Feb 7 2016 1:30 PM | Updated on Oct 1 2018 2:36 PM

అప్పుల బాధ తాళలేక అన్నదాత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పుల బాధ తాళలేక అన్నదాత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా బంటువరం మండలం తొరమామిడి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొటపల్లి చంద్రయ్య(35) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో బోరు బావులు ఎండి పోవడంతో.. చెరుకు దిగుబడి రాక పోవడంతో.. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు తీర్చే దారి కానరాక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement