వివాహిత మృతి కేసు.. తండ్రే హంతకుడు | The death of the married father killer case | Sakshi
Sakshi News home page

వివాహిత మృతి కేసు.. తండ్రే హంతకుడు

May 27 2015 1:52 AM | Updated on Jul 30 2018 8:29 PM

రాయికోడ్ : మండలంలోని ఇందూర్ గ్రామంలో ఈ నెల 20వ తేదీన వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటనలో కన్నతండ్రే హంతకుడిగా పోలీసుల విచారణలో తేలింది.

రాయికోడ్ : మండలంలోని ఇందూర్ గ్రామంలో ఈ నెల 20వ తేదీన వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటనలో కన్నతండ్రే హంతకుడిగా పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం జహీరాబాద్ రూరల్ సీఐ రఘు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు  వివరించారు.
 
 ఇందూర్ గ్రామానికి చెందిన రుకియా బేగం (30) ఈ నెల 20న ఇందూర్‌లోని తన తల్లిదండ్రుల ఇంట్లో మృతి చెందింది. అయితే  బేగం మృతిపై అత్తింటి వారు అనుమానం వ్యక్తం చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
 
 ఈ క్రమంలో తండ్రిని విచారించగా.. తన కుమార్తె మానసిక స్థితి సరిగా లేక భరించలేక ఈ నెల 29వ రాత్రి చీరతో ఉరేసి హత్య చేసినట్లు మృతురాలి తండ్రి గౌస్ మొహల్లా ఒప్పుకున్నాడు. దీంతో అతడిపై హత్యకేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. సమావేశంలో ఎస్‌ఐ శివప్రసాద్, హెడ్‌కానిస్టేబుల్ గౌస్, కానిస్టేబుల్ భీంరావు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement