అభాగ్యురాలికి చేయూత | The construction of the house with Rs 40 thousand to andhurali | Sakshi
Sakshi News home page

అభాగ్యురాలికి చేయూత

Dec 25 2015 1:17 AM | Updated on Mar 19 2019 6:19 PM

నిరుపేదలకు సాయం అందించిన వారు జీవితాంతం గుర్తుం టారని పెద్దలు చెప్పిన మాటలను ఈ యువకులు అక్షరాల

ఆదర్శంగా నిలిచిన యువజన సంఘం
అంధురాలికి రూ.40వేలతో ఇంటి నిర్మాణం

 
మంగపేట : నిరుపేదలకు సాయం అందించిన వారు జీవితాంతం గుర్తుం టారని పెద్దలు చెప్పిన మాటలను ఈ యువకులు అక్షరాల పాటించారు. చదువే కాదు.. సమాజాభివృద్ధి కూడా తమకు ముఖ్యమని భావించారు. ప్రభుత్వ ఆసరా లేక అవస్థలు పడుతున్న ఓ అంధురాలికిఇల్లు కట్టించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే.. మంగపేట మండల కేంద్రంలోని పొదుమూరుకు చెందిన ఎర్రావుల గౌరమ్మ భర్త సమ్మయ్య 15 ఏళ్ల క్రితం మృతిచెందాడు. పదేళ్ల క్రితం ఆకస్మికంగా గౌరమ్మ కంటిచూపు కూడా పోయింది. కూతురుకు వివాహం చేయగా.. ఆమెను భర్త వదిలేసి వెళ్లాడు. దీంతో కూతరు గౌరమ్మ వ ద్దనే ఉంటోంది. వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ తల్లిని పోషిస్తోంది. ఈ క్రమంలో సొంత ఇల్లు లేక అద్దె గుడిసెలో తలదాచుకుంటున్న తల్లీకూతుళ్ల ఇబ్బందులను గ్రామంలోని చర్చి పాస్టర్ శ్రీనివాస్ గమనించారు. ఈ విషయూన్ని ఆయన స్థానిక జ్వాల యువజన సంఘం అధ్యక్షుడు కోడెల నరేష్‌కు విషయాన్ని వివరించారు.

గౌరమ్మ కుటుంబ దీనస్థితిపై స్పందించిన నరేష్ సంఘం సభ్యులతో చర్చించి ఆమెకు సాయం అందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మూడు నెలల నుంచి సంఘం సభ్యులు వివిధ గ్రామాల్లో పర్యటించి రూ.40 వేల విరాళాలు సేకరించి పొదుమూరులోని ఆమె సొంత స్థలంలో కొత్త ఇల్లు కట్టించారు. ఈ మేరకు నూతన ఇల్లును యూత్ అధ్యక్షుడు నరేష్.. పాస్టర్ శ్రీనివాస్ సమక్షంలో గురువారం గౌరమ్మకు అప్పగించారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ అంధత్వంతో బాధపడుతున్న గౌరమ్మకు రేషన్ కార్డు లేదని చెప్పారు. ప్రజాప్రతినిధులు స్పందించి ఆమెకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు అజయ్, చరణ్, చందు, ఇంతియాజ్, వినయ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement