ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి  | TGO Members Met Telangana CS Joshi | Sakshi
Sakshi News home page

సీఎస్‌ జోషీని కలిసిన టీజీవోలు  

Apr 25 2018 1:52 AM | Updated on Apr 25 2018 1:52 AM

TGO Members Met Telangana CS Joshi - Sakshi

సచివాలయంలో సీఎస్‌ ఎస్‌కే జోషీని కలిసిన టీజీవో నేతలు

సాక్షి, హైదరాబాద్‌ : ఉద్యోగుల బదిలీలపై వెంటనే స్పందించాలని టీజీవోల చైర్మన్‌ వి.శ్రీనివాస్‌గౌడ్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషీని టీజీవో నేతలు కలిసి సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ప్రమోషన్‌ కల్పించాలని శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు. పీఆర్‌సీ కమిటీని ప్రకటించాలని, కోరారు. కార్మిక శాఖలో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, భార్యాభర్తలకు సంబంధించిన మార్గదర్శకాలు వెంటనే విడుదల చేయా లని టీజీవో అధ్యక్షురాలు మమత కోరారు. దీనిపై సీఎస్‌ స్పందిస్తూ తన పరిధిలో ఉన్న విషయాలపై 10 రోజుల్లో స్పష్టత ఇస్తానని, మిగతా అంశాలపై సీఎంతో చర్చిస్తానని హామీనిచ్చారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement