కొత్తకోట మండలం నర్సింగాపురం గ్రామంలో ఓ దళిత యువకుడి మరణం ఉద్రిక్తతకు దారి తీసింది.
దళిత యువకుడి మరణం
పరిస్థితికి కారణం
పోలీసుల బందోబస్తు
కొత్తకోట : కొత్తకోట మండలం నర్సింగాపురం గ్రామంలో ఓ దళిత యువకుడి మరణం ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా గ్రామంలో పోలీసు బలగాలను మోహరించారు. గత ఏడాది ఆగస్టు 15న గ్రామానికి చెందిన బాలకృష(్ణ32) అనే దళిత యువకుడు ఓ ప్రేమజంటకు సహకరించాడన్న ఆరోపణలతో ఆతనిపై అమ్మాయి సంబంధీకులు గ్రామంలో స్తంభానికి కట్టేసి దాడి చేశారు. ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకుని అతన్ని విడిపించారు. దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి జైలుకు పంపారు. అయితే మూడు నెలల పాటు వైద్యం పొందిన బాలకృష్ణ హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడని శవాన్ని గ్రామానికి తీసుకువచ్చారు.
అయితే తన అన్న మరణంపై అనుమానాలున్నాయని, గతంలో జరిగిన దాడి వల్లే ఊపిరితిత్తులు దెబ్బతిని మరణించాడని తమ్ముడు తిరుపతయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో శవాన్ని సాయంత్రం పోస్టుమార్టం కోసం వనపర్తికి తరలించారు. అనంతరం రాత్రి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈనేపథ్యంలోనే పలు దళిత సంఘాల నాయకులు బాలకృష్ణ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశాయి. గతంలో దాడి చేసిన వారిపై నమోదు చేసిన హత్యాయత్నం చేసును హత్య కేసుగా నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిజానిజాలు వెలికి తీసి బాధ్యులను శిక్షించాలని కొత్తకోట అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు ఇజ్రయిల్, నాయకులు కె.భరత్‌భూషన్, మిషేక్, పి.ప్రశాంత్, మన్నెం, జె.ఆర్.కుమార్, దావీద్, నారాయణ డిమాండ్ చేశారు.