కారేపల్లిలో ఉద్రిక్తత | tension in karepalli in khammam district | Sakshi
Sakshi News home page

కారేపల్లిలో ఉద్రిక్తత

Jun 20 2016 11:01 AM | Updated on Sep 4 2017 2:57 AM

‘‘గత 40 సంత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న ప్రాంతాన్ని వదిలి పొమ్మంటే.. మేము ఏడికి పోతాం.. చావనైనా చస్తాం కానీ ఇక్కడి నుంచి మాత్రం పోయేదిలేదని’’

కారేపల్లి: ‘‘గత 40 సంత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న ప్రాంతాన్ని వదిలి పొమ్మంటే.. మేము ఏడికి పోతాం.. చావనైనా చస్తాం కానీ ఇక్కడి నుంచి మాత్రం పోయేదిలేదని’’ పోడు వ్యవసాయం చేసుకుంటున్న మహిళలు అటవీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం తాడేపల్లి అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం మొక్కలు నాటేందుకు వచ్చిన అటవీ అధికారులను స్థానిక మహిళలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. స్థానిక మహిళలు అధికారుల మీదకు తిరగబడటంతో పాటు తోపులాటకు దిగడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళన కారుల్లో మహిళలు ఎక్కువగా ఉండటంతో.. అధికారులు పెద్ద ఎత్తున మహిళ సిబ్బందిని పిలిపించి ఆందోళనకారులను శాంతింపచేయడానికి యత్నిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement