వణికిస్తున్న చలి.. తగ్గిన ఉష్ణోగ్రతలు | temeperature decreases day by day in telangana | Sakshi
Sakshi News home page

వణికిస్తున్న చలి.. తగ్గిన ఉష్ణోగ్రతలు

Nov 24 2016 3:30 AM | Updated on Sep 4 2017 8:55 PM

రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఖమ్మం, నల్లగొండల్లో తగ్గిన ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఖమ్మం, నల్లగొండల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు తగ్గాయి. ఖమ్మంలో 14 డిగ్రీలు, నల్లగొండలో 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మెదక్‌లో 4 డిగ్రీలు తక్కువగా 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డవగా హైదరాబాద్‌లో సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువగా 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్, రామగుండంలో 14 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement