వికారాబాద్ జిల్లాలో గురువారం విషాదం చోటు చేసుకుంది.
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో గురువారం విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని తాండూరు మండలం వీర్‌సెట్టిపల్లిలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన చంద్రమోహన్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
తెలంగాణ ఏర్పడ్డాక ఉద్యోగాలు వస్తాయనే ఆశతో చంద్రమోహన్ ఉన్నాడని... అయితే ఇప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో మనస్థాపం చెంది బలవన్మరణం చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా తెలంగాణలో పోస్టులు భర్తీ కావడం లేదంటూ మనస్థాపం చెందిన ఇద్దరు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.