చర్చలు విఫలం.. ఎల్లుండినుంచి ఆర్టీసీ సమ్మె | Telangana RTC Strike From October 5th | Sakshi
Sakshi News home page

చర్చలు విఫలం.. ఎల్లుండినుంచి ఆర్టీసీ సమ్మె

Oct 3 2019 9:26 PM | Updated on Oct 3 2019 9:36 PM

Telangana RTC Strike From October 5th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఆర్టీసీ జేఏసీతో ఐఏఎస్‌ అధికారుల కమిటీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఎల్లుండి నుంచి ఆర్టీసీ  సమ్మె యథాతధంగా జరగనుందని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. ప్రజారవాణాను కాపాడటానికి కార్మికులు పోరాడాలని జేఏసీ పిలుపునిచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని పట్టుబట్టింది. కాగా, అక్టోబర్‌ 5 నుంచి సమ్మె చేస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెను తప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎస్‌ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ ఈ ఉదయంనుంచి ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపింది. అధికారులు ఆశించిన మేరకు స్పందించకపోవటంతో ఆర్టీసీ జేఏసీ సమ్మెకు సై అంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement