‘ప్రైవేటు ఫీజులపై ఉత్తర్వులివ్వాలి’ | Telangana Parents Association demands on Private Schools Fees issue | Sakshi
Sakshi News home page

‘ప్రైవేటు ఫీజులపై ఉత్తర్వులివ్వాలి’

May 22 2018 1:07 AM | Updated on Oct 1 2018 5:40 PM

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు నిర్ధారిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని తెలంగాణ పేరెంట్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. పాఠశాలలు ప్రారంభమయ్యే లోపే ఉత్తర్వులు జారీ చేస్తే అడ్మిషన్ల ప్రక్రియలో ఇబ్బందులుండవని పేర్కొంది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు నారాయణ, కార్యదర్శి లక్ష్మయ్య సోమవా రం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రైవేటు స్కూళ్లలో విక్రయించే పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాం మార్కెట్‌ ధరలకే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పేద పిల్లలకు రిజర్వేషన్లు కల్పించాలని, విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement