ప్రత్యేక బార్‌కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలి | telangana Lawyer jac cal chalo highcourt | Sakshi
Sakshi News home page

ప్రత్యేక బార్‌కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలి

Jan 31 2015 6:56 PM | Updated on Sep 2 2017 8:35 PM

తెలంగాణకు రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయడంతో పాటు బార్ కౌన్సిల్‌ను విభజించాలని కోరుతూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఫిబ్రవరి 2 న ఛలో హైకోర్టు కార్యక్రమానికి పిలుపునిచ్చింది.

హైదరాబాద్: తెలంగాణకు రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయడంతో పాటు బార్ కౌన్సిల్‌ను విభజించాలని కోరుతూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఫిబ్రవరి 2 న ఛలో హైకోర్టు కార్యక్రమానికి పిలుపునిచ్చింది. పిబ్రవరి 2 వ తేదీ నుంచి 4వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల విధులను బహిష్కరించాలని నిర్ణయించింది.

తెలంగాణ న్యాయవాదుల జేఏసీ చైర్మన్ ఎం.రాజేందర్‌రెడ్డి, నాంపల్లి క్రిమినిల్ కోర్టుల బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి.కొండారెడ్డి నేతృత్వంలో నాంపల్లి కోర్టులో శనివారం అన్ని జిల్లాలకు చెందిన న్యాయవాదుల సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, బార్ కౌన్సిల్ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ సాధించుకున్నా...ఉమ్మడి హైకోర్టుతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement