breaking news
chalo highcourt
-
విభజనపై దద్దరిల్లిన హైకోర్టు
హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించాలని తెలంగాణ బార్ అసోసియేషన్ మంగళవారం హైకోర్టులో ఆందోళన చేపట్టింది. ఛలో హైకోర్టు పిలుపుతో జిల్లాల నుంచి పెద్ద ఎత్తున న్యాయవాదులు తరలివచ్చి నినాదాలు చేశారు. కోర్టులో కేసులు విచారణ జరుగుతుండగానే ఆవరణలో జై తెలంగాణ నినాదాలు మారు మోగాయి. ఆందోళన ఎక్కువ కావడంతో పోలీసులు భారీగా మొహరించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
ప్రత్యేక బార్కౌన్సిల్ను ఏర్పాటు చేయాలి
హైదరాబాద్: తెలంగాణకు రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయడంతో పాటు బార్ కౌన్సిల్ను విభజించాలని కోరుతూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఫిబ్రవరి 2 న ఛలో హైకోర్టు కార్యక్రమానికి పిలుపునిచ్చింది. పిబ్రవరి 2 వ తేదీ నుంచి 4వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల విధులను బహిష్కరించాలని నిర్ణయించింది. తెలంగాణ న్యాయవాదుల జేఏసీ చైర్మన్ ఎం.రాజేందర్రెడ్డి, నాంపల్లి క్రిమినిల్ కోర్టుల బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి.కొండారెడ్డి నేతృత్వంలో నాంపల్లి కోర్టులో శనివారం అన్ని జిల్లాలకు చెందిన న్యాయవాదుల సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, బార్ కౌన్సిల్ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ సాధించుకున్నా...ఉమ్మడి హైకోర్టుతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.