యశోద, కిమ్స్‌పై ఏం చర్యలు తీసుకున్నారు? | Telangana High Court On Corona Tests And Treatment In State | Sakshi
Sakshi News home page

యశోద, కిమ్స్‌పై ఏం చర్యలు తీసుకున్నారు?

Jul 14 2020 5:02 PM | Updated on Jul 14 2020 5:55 PM

Telangana High Court On Corona Tests And Treatment In State - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కోవిడ్‌ నోడల్‌ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు, బాధితులకు అందుతున్న చికిత్సపై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. గాంధీ ఆస్పత్రిలోనూ కరోనా పరీక్షలు జరపాలని ఈ సందర్భంగా న్యాయస్థానం ఆదేశించింది. కేంద్రం కల్పించిన అధికారాలతో ప్రైవేటు ఆస్పత్రులను నియంత్రించాలని సూచించింది. కరోనా బాధితులకు 4 లక్షల రూపాయలకు పైగా బిల్లులు వేసిన యశోద, కిమ్స్‌ ఆస్పత్రులపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. (తెలంగాణలో 99 శాతం రికవరీ : హెల్త్‌ డైరెక్టర్‌)

అలాగే ప్రైవేటు కేంద్రాల్లో అన్ని రకాల పరీక్షలకు గరిష్ట చార్జీలు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆస్పత్రుల్లో బెడ్లు, వెంటిలేటర్ల వివరాలను విస్తృత ప్రచారం చేయాలని సూచించింది. నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో కరోనా చికిత్సలు చేస్తారా లేదో చెప్పాలని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో ఈ నెల 27లోగా నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది.(నిమ్స్‌లో మొదలైన కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌)

Advertisement
 
Advertisement
Advertisement