కేసీఆర్......షాదీ ముబారక్ | Telangana government to give Rs 51000 under shadi mubarak | Sakshi
Sakshi News home page

కేసీఆర్......షాదీ ముబారక్

Sep 23 2014 2:02 PM | Updated on Sep 2 2017 1:51 PM

ముస్లిం వధువులకు వివాహానికి రూ.51వేల చొప్పున నగదు సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్ : ముస్లిం వధువులకు వివాహానికి రూ.51వేల చొప్పున నగదు సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ 'షాదీ ముబారక్' గా నామకరణం చేశారు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కేసీఆర్ సూచించారు.

అలాగే దసరా నుంచి కల్యాణ లక్ష్మి పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించనుంది.  ఈ పథకం ద్వారా దళిత, గిరిజన వధువులకు వివాహానికి రూ. 50 వేల ఆర్థిక సాయం అందిస్తారు. ఆ నగదును ప్రభుత్వం పెళ్లి కూతురు పేరిట బ్యాంకులో జమ చేయనుంది. రాష్ట్రంలో ఏటా దాదాపు లక్ష వరకు ఎస్సీ, ఎస్టీ అమ్మాయిల పెళ్లిళ్లు జరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement