కాశ్మీర్ తరహా టూరిజాన్ని అభివృద్ధి చేస్తాం! | Telangana Government ready to develop Aadilabad District | Sakshi
Sakshi News home page

కాశ్మీర్ తరహా టూరిజాన్ని అభివృద్ధి చేస్తాం!

Oct 1 2014 6:25 PM | Updated on Aug 15 2018 9:22 PM

గిరిజన హక్కుల కోసం పోరాడిన నాయకుడు కొమరం భీమ్ వర్ధంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది

హైదరాబాద్: గిరిజన హక్కుల కోసం పోరాడిన నాయకుడు కొమరం భీమ్ వర్ధంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 8 తేదిన ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్ లో జరిగే కొమరం భీమ్ వర్ధంతి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారని తెలంగాణ రాష్ట్ర ఆటవీశాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. 
 
సహజవనరులు పుష్కలంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లా అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రామన్న అన్నారు. జిల్లాను కాశ్మీర్ తరహా టూరిజంగా అభివృద్ధి చేస్తామన్నారు. 200 ఎకరాల్లో కొమరం భీమ్ గౌరవార్థం ఓ పార్క్ ను ఏర్పాటు చేస్తామని జోగు రామన్న తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement