సుప్రీంకోర్టు తీర్పు మేరకు డీఎస్సీ నియామకాలు చేపట్టాలని భారత ప్రజాతంత్ర సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) డిమాండ్ చేసింది.
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు తీర్పు మేరకు డీఎస్సీ నియామకాలు చేపట్టాలని భారత ప్రజాతంత్ర సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టు 8792 పోస్టులు భర్తీ చేయాలని చెబితే రాష్ట్ర ప్రభుత్వం వాటిల్లో 342 ఉద్యోగాలకు కోత పెట్టి 8,452 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తోందని డీవైఎఫ్‌ఐ అధ్యక్షుడు ఎం.విప్లవ్‌కుమార్ ఒక ప్రకటలో విమర్శించారు.
కేవలం సుప్రీంతీర్పులోని పోస్టులే కాకుండా తెలంగాణలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం డీఎస్సీని నిర్లక్ష్యం చేయడం వల్ల నిరుద్యోగులు నిరాశతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.