
బాన్సువాడ: సంక్షేమ రంగంలో దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ముందంజలో ఉందని, సంక్షేమ పథకాలు 85శాతం మందికి అందుతున్నాయని ఆపద్ధర్మ మంత్రి పోచారం పేర్కొన్నారు. సోమవారం ఎన్నికల్లో బూత్‌స్థాయిలో అనుసరించాల్సిన ప్రచార సరళిపై బాన్సువాడ మండల టీఆర్‌ఎస్ నాయకుల, కార్యకర్తల, బూత్ స్థాయి కమిటీ సభ్యులు, కన్వీనర్లు, పర్యవేక్షణ కమిటీ సభ్యులతో పట్టణంలోని నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యాలయంలో మంత్రి పోచారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై నాలుగేళ్ల మూడు నెలలు అవుతోందన్నారు.
దేశంలో 29 రాష్ట్రాలుండగా, ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో 36 సంక్షేమ పథకాలకు రూ. 42వేల కోట్లు కేటాయించారన్నారు. 43లక్షల మంది ప్రజలకు రూ. 5,600 కోట్లను పెన్షన్‌గా అందిస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఆసరా పింఛన్లను రూ. 2016, వికలాంగులకు రూ. 3016కు పెంచుతున్నామన్నారు. సొంత స్థలం ఉన్న లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో 70 శాతం ప్రజలు ఆధారపడిన వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం భారీగా నిధులను కేటాయిస్తున్నామన్నారు. టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అంకిత భావంతో పని చేయాలని సూచించారు.
అందుకే బూత్‌స్థాయి కమిటీలను ఏర్పాటు చేశామని, ప్రతి 60 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జిని నియమించామన్నారు. ఈ 60 మంది కచ్చితంగా పోలింగ్‌లో పాల్గొనేవిధంగా చూడాలన్నారు. కార్యకర్తల జోష్ చూసుంటే ప్రతిపక్షాల డిపాజిట్లు కూడా గల్లంతవడం ఖాయమని çమంత్రి పేర్కొన్నారు. సమావేశంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు మోహన్ నాయక్, దేశాయ్‌పేట సొసైటీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ఎర్వల కృష్ణారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్‌నార్ల సురేష్, సంగ్రాం నాయక్, మహ్మద్ ఎజాస్, గంగాధర్, గోపాల్‌రెడ్డి, నాగులగామ వెంకన్న గుప్త, నారాయణరెడ్డి, పాత బాలకృష్ణ, కొత్తకొండ భాస్కర్, గురువినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.