చట్టానికి విరుద్ధంగా గవర్నర్కి అధికారాలా? | Telangana congress ex mps takes on NDA | Sakshi
Sakshi News home page

చట్టానికి విరుద్ధంగా గవర్నర్కి అధికారాలా?

Aug 12 2014 2:07 PM | Updated on Mar 18 2019 9:02 PM

రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధంగా ఎన్డీయే సర్కార్ ....గవర్నర్కు అధికారాలు కట్టబెడుతోందని తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎంపీలు ఆరోపించారు.

హైదరాబాద్: రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధంగా ఎన్డీయే సర్కార్ ....గవర్నర్కు అధికారాలు కట్టబెడుతోందని తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, వివేక్, రాజయ్య ఆరోపించారు. తెలంగాణ బీజేపీ నేతలు ఈ అంశాన్ని ప్రశ్నించకుండా సీమాంధ్రనేత అయిన వెంకయ్య నాయుడుకి మోకరిల్లుతున్నారని వారు మండిపడ్డారు.

 

గవర్నర్కు అధికారాల విషయంలో టీడీపీ, బీజేపీ రహస్య ఎజెండాతో వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఘర్షణ వాతావరణం లేకుండా హైదరాబాద్ ప్రజలంతా కలిసి మెలిసి ఉండేలా చూడాలని వారు సూచించారు. కేసీఆర్ ఏకపక్ష వైఖరి వల్లే కొన్ని సమస్యలు వస్తున్నాయని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement