తెలంగాణ అసెంబ్లీ తొలిరోజు షెడ్యూల్‌..

Telangana Assembly Second Term Starts On January 17th - Sakshi

సాక్షి హైదరాబాద్‌ :  తెలంగాణ రెండో శాసనసభ తొలి సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు శాసనసభ్యుల చేత ప్రొటెం స్పీకర్‌ ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. మిగతా శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం మండలి సభ్యులు, ఎమ్మెలేయలు జూబ్లీహాలు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొంటారు. 

తెలంగాణ శాసనసభ షెడ్యూల్‌.. 

  • ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభాపతి ఎంపిక కోసం నామినేషన్‌ దాఖలు ప్రక్రియ.
  • ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేలతో కలిసి గన్‌పార్క్‌లో తెలంగాణ అమరులకు నివాళులు.
  • 11.20కి ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభకు చేరుకుంటారు.
  • 11.30కి ప్రొటెం స్పీకర్‌ ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ అధ్యక్షతన శాసనసభా సమావేశం ప్రారంభం. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం.

ముందుగా సీఎం కేసీఆర్‌ చేత ప్రొటెం స్పీకర్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత మహిళా సభ్యుల ప్రమాణం స్వీకారం చేశారు. అక్షర క్రమంలో మొదటగా ఉన్నా ఖానాపూర్‌ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌, తర్వాత కాంగ్రెస్‌ ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ప్రమాణం చేశారు. ఆ తరువాత ఆరుగురు మహిళా సభ్యుల ప్రమాణం చేశారు. అటు తర్వాత మొదటగా ఆలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం ప్రమాణ స్వీకారం చేశారు. చివరగా వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  రాజ్‌భవన్‌లో తాత్కాలిక సభాపతి అహ్మద్‌ఖాన్‌ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. 

రెండు గంటల పాటు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం కార్యక్రమం కొనసాగనుంది అనంతరం మండలి ప్రాంగణంలో జరిగే విందుకు అంతా హాజరవుతారు. తాత్కాలిక సభాపతి స్థానంలో శాశ్వత సభాపతిని ఎంపిక చేసేందుకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ల దాఖలు కార్యక్రమం ఉంటుంది. 18న శాసనసభాపతి ఎన్నిక ఉంటుంది. 19న శాసనసభ, మండలి ఉభయసభల సమావేశంలో గవర్నర్‌ ప్రసంగిస్తారు. 20న శాసనసభ, మండలిలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించి ఆమోదిస్తారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top