తెలంగాణ కళాకారుడి ఆత్మహత్య | Telangana artist's suicide | Sakshi
Sakshi News home page

తెలంగాణ కళాకారుడి ఆత్మహత్య

Jan 6 2016 7:39 PM | Updated on Sep 3 2017 3:12 PM

చొప్పదండి మండలం రాగంపేట గ్రామ శివారులో కరుణాసాగర్(26) అనే తెలంగాణ కళాకారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

చొప్పదండి మండలం రాగంపేట గ్రామ శివారులో కరుణాసాగర్(26) అనే తెలంగాణ కళాకారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ కళాకారుల కోటాలో తనకు ఉద్యోగం లభించలేదని మనస్థాపం చెందిన కరుణా సాగర్ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో సాగర్ పలు ధూంధాం కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు గ్రామస్తులు తెలిపారు. తల్లిదండ్రులు గుడ్డివారు. పెళ్లికాని ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



 

Advertisement
 
Advertisement
Advertisement