ముగిసిన టెక్నో ఫెస్టు-2014 వేడుకలు | Techno Festa celebrations ended -2014 | Sakshi
Sakshi News home page

ముగిసిన టెక్నో ఫెస్టు-2014 వేడుకలు

Mar 23 2014 4:27 AM | Updated on Sep 2 2017 5:01 AM

టెక్నో ఫెస్టు-2014 వేడుకలు

టెక్నో ఫెస్టు-2014 వేడుకలు

మండలంలోని మానిక్‌భండార్ గ్రామ సమీపంలోని విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి టెక్నో ఫెస్టు-2014 వేడుకలు శనివారం ముగిశాయి.

మాక్లూర్, న్యూస్‌లైన్ : మండలంలోని మానిక్‌భండార్ గ్రామ సమీపంలోని విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి టెక్నో ఫెస్టు-2014  వేడుకలు శనివారం ముగిశాయి.  ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని హంగామా చేశారు. అంత్యాక్షరి, క్విజ్, జామ్, ఫైల్, హరీల్, ట్రైజరి, నృత్యాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఐడియా  సంస్థ  వారు  స్లోబైక్ రైడింగ్ నిర్వహించి విద్యార్థులను చైతన్య పరిచారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బీఆర్ విక్రమ్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ విద్యార్థులు మంచిగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. విద్యార్థులు తమ గమ్యం చేరే వ రకు క్రమశిక్షణతో ముందుకుపోవాలన్నారు.

అనంతరం విద్యార్థులను ఆయన అభినందించి, నగదు, సర్టిఫికెట్లు అందజేశారు.  కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన సుమారు వెయ్యి మంది విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Advertisement
 
Advertisement
Advertisement