కరెంట్‌ లేక ఆగిన మెట్రోరైల్‌

 Technical Problem In Hyderabad Metro Train Stops At Balanagar Station - Sakshi

బాలానగర్‌ స్టేషన్‌లో నిలిచిన మెట్రోరైల్‌

సాక్షి, హైదరాబాద్ : మియాపూర్‌-అమీర్‌ పేట్‌ మెట్రో రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. ప్రయాణీకులతో బయలు దేరిన మెట్రోరైలు ఆకస్మాత్తుగా కూకట్‌పల్లి వై జంక్షన్‌లోని డాక్టర్‌ అంబేడ్కర్‌ బాలానగర్‌ రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయింది. మెట్రో పవర్‌ ప్లాంట్‌లో సమస్య తలెత్తడంతోనే రైలు నిలిచిపోయిందని సిబ్బంది తెలిపారు. ప్రయాణీకులు మాత్రం విద్యుత్‌ అంతరాయం వల్లనే రైలు మార్గ మధ్యలో ఆగిపోయిందని ఆరోపించారు. రైలు ఆగిపోవడంతో ఆందోళన చేపట్టిన ప్రయాణీకులకు అధికారులు వారి టికెట్‌ ధర చెల్లించి పంపించేశారు. 

ఈ ఘటనతో కొద్దిసేపు మియాపూర్‌ నుంచి ఎర్రగడ్డ వరకు మెట్రోసేవలు నిలిచిపోయాయి. ఒక ట్రాక్‌ వైర్ తెగిపడిపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని అధికారులు స్పష్టం చేశారు. రెండో ట్రాక్‌పై రైల్లు నడుస్తున్నాయన్నారు. ఈ సమస్యను పరిష్కరించగానే పూర్తి సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. సమస్య పరిష్కారానికి అధికారులు మరమత్తు చర్యలు చేపట్టారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top