తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల బదలీలు ఆన్లైన్లోనే నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల బదలీలు ఆన్లైన్లోనే నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లో తెలంగాణ టీచర్ల బదిలీలకి సంబంధించిన షెడ్యూల్ను ఆయన విడుదల చేశారు. అనంతరం కడియం మాట్లాడారు. హెడ్మాస్టర్లకు ఐదేళ్లు దాటితే బదిలీ తప్పనిసరి అని స్పష్టం చేశారు. 2 ఏళ్లు దాటిన వారు బదిలీకి అర్హులని చెప్పారు. అలాగే 8 ఏళ్లు దాటిన వారికి బదిలీ తప్పనిసరి అని కడియం వెల్లడించారు.