వారసత్వం పేరు చెప్పుకొని మరోసారి సింగరేణి ఎన్నికల్లో గెలువాలని టీబీజీకేఎస్ కుట్ర పన్నుతోందని ఏఐటీయూసీ, హెచ్‌ఎమ్మెస్ నేతలు ఆరోపించారు.
శ్రీరాంపూర్(మంచిర్యాల): వారసత్వం పేరు చెప్పుకొని మరోసారి సింగరేణి ఎన్నికల్లో గెలువాలని టీబీజీకేఎస్ కుట్ర పన్నుతోందని ఏఐటీయూసీ, హెచ్‌ఎమ్మెస్ నేతలు ఆరోపించారు. ఆర్కే 5గనిపై గురువారం నిర్వహించిన జాతీయ సంఘాల గేట్ మీటింగ్‌లో ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి ముస్కె సమ్మయ్య, హెచ్‌ఎమ్మెస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు పేరం రమేశ్ మాట్లాడారు. వారసత్వ ఉద్యోగాలిస్తామని నమ్మించి కార్మికులను మోసం చేసిన టీబీజీకేఎ‹స్‌కు రానున్న గుర్తింపు ఎన్నికల్లో బుద్ది చెప్పాలన్నారు.
వారసత్వ ఉద్యోగాల సాధన కోసం జాతీయ సంఘాలన్ని కలిసి ఈ నెల 15 నుంచి నిరవధిక సమ్మెకు పిలు పునివ్వగా.. సమ్మెను నీరుగార్చేందుకు టీ బీజీకేఎస్ నాయకులు కుట్ర చేస్తున్నారని ఆ రోపించారు. తాడిచెర్ల బొగ్గుబ్లాకుల ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి ల్యాగల శ్రీనివాస్, నాయకులు బి య్యాని శ్రీనివాస్, జోగుల మల్లయ్య, మేక ల దాసు, ప్రసాద్‌రెడ్డి, హెచ్‌ఎమ్మెస్ బ్రాం చి కార్యదర్శి తిరుపతిగౌడ్, నాయకులు వినయ్‌కుమార్, నర్సయ్య, మల్లేశ్, తిరుపతిరెడ్డి, శంకరయ్య పాల్గొన్నారు.
సమ్మెతోనే వారసత్వ ఉద్యోగ సాధన
మందమర్రి: జూన్ 15న సింగరేణి వ్యాప్తం గా తలపెట్టిన సమ్మెను కార్మికులు విజయవంతం చేయాలని, సమ్మెతోనే వారసత్వ ఉద్యోగ సాధన సాధ్యమవుతుందని ఐఎన్‌టీయూసీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు సిద్దంశెట్టి రాజమొగిలి, ఏఐటీయూసీ ఏరి యా ఏరియా బ్రాంచి కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, సీఐటీయూ ఏరియా కా ర్యదర్శి ఎస్.వెంకటస్వామి, హెచ్‌ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు బోనాల శ్రీనివాస్ అన్నారు. ఏరియాలోని కేకే–1 గనిలో గురువారం ఏర్పాటు చేసిన గెట్ మీటింగ్‌లో వా రు మాట్లాడారు.