నేడు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు | Sakshi
Sakshi News home page

నేడు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు

Published Wed, Dec 27 2023 4:27 AM

Election of Singareni Identification Society today - Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్రానికి కొంగుబంగారంగా నిలిచిన సింగరేణి సంస్థ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. నిధులు, నియామకాల్లో నంబర్‌వన్‌గా నిలిచిన సింగరేణి సంస్థ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే. ఈసారి ఎన్నికల్లో 39,748 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 11 ఏరియాల్లో ఈ ఎ న్నికలను నిర్వహించేందుకు కార్మికశాఖ ఏర్పా ట్లుచేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి సంస్థలో తరచూ సమ్మెలు జరగడం, ఉత్పత్తికి తీవ్రవిఘాతం కలగడం సర్వసాధారణంగా మారింది. దీంతో సంస్థకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి.

1998లో వాస్తవ పరిస్థితులు సమీక్షించిన అప్ప టి ముఖ్యమంత్రి సమ్మెల నివారణ లక్ష్యంగా గుర్తింపు సంఘం ఎన్నికలకు శ్రీకారం చుట్టా రు. ఇలా మొదలైన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు మొదటి రెండుసార్లు రెండేళ్ల కాలపరిమితితో సాగాయి. ఆ తర్వాత మూడు దఫాలు సింగరేణి యాజమాన్యంతో జరిగిన ఒప్పందం నేపథ్యంలో నాలుగేళ్ల కాలపరిమితితో నిర్వహించారు. అయితే 2017లో కేంద్ర కార్మిక శాఖ రెండేళ్ల కాలపరిమితి అని తేల్చింది. ఎన్నికలకు ముందు నాలుగేళ్లు అని చెప్పి తాము గెలిచాక రెండేళ్లు అంటున్నారని పేర్కొంటూ గుర్తింపు సంఘం హైకోర్టులో పిటిషన్‌ వేసింది.

ఈ క్రమంలో 2021 వరకు ఎన్నికలు జరగలేదు. ఆ తర్వాత కరోనా వైరస్‌ విజృంభించడంతో మరో రెండేళ్ల పాటు జాప్యం జరిగింది. చివరకు ఏఐటీయూసీ హైకోర్టులో కేసు వేయడంతో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో చలనం వచ్చింది. అయితే ఎన్నికల సన్నాహాలు ఇతర కారణాలతో వాయిదా వేయాలని రాష్ట్ర ఇంధన కార్యదర్శి కోర్టులో పిటిషన్‌ వేశారు. కానీ ఎన్నికలు జరపాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.

రిటర్నింగ్‌ అధికారి రెండేళ్ల కాలపరిమితితో నోటిఫికేషన్‌ జారీ చేసినా, ఎన్నికల తర్వాత గెలిచిన సంఘం నాలుగేళ్ల కాలపరిమితి ఒప్పందాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉండటంతో..గుర్తింపు సంఘం రెండేళ్లే ఉంటుందా? నాలుగేళ్ల వరకు కొనసాగుతుందా? అని సింగరేణి వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. 

2012 నుంచి ప్రతిష్టాత్మకంగా..  
సింగరేణి ఎన్నికలు 2012 నుంచి అన్ని పార్టీల కు ప్రతిష్టాత్మంగా మారాయి. సంస్థ విస్తరించి న 11 ఏరియాల్లో 11 మంది ఎమ్మెల్యేలు ప్రాతి నిధ్యం వహిస్తుండటంతో కీలకంగా మారాయి. అప్పటి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రత్యేకంగా దృష్టి సారించి ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యే క పరిశీలకులను నియమించారు. ఈ క్రమంలో రెండుసార్లు గుర్తింపు యూనియన్‌గా బీఆర్‌ఎస్‌ పార్టీ అనుబంద టీబీజీకేఎస్‌ (తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం) గెలిచింది. తాజా ఎన్నికలు టీబీజీకేఎస్, కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ ఐఎన్‌టీయూసీ, సీపీఐ అనుబంధ ఏఐటీ యూసీ మధ్య జరుగుతున్నాయి.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement