బిర్యానీ హౌస్‌పై దాడులు | task force officers attacked the biryani house | Sakshi
Sakshi News home page

బిర్యానీ హౌస్‌పై దాడులు

Aug 29 2017 9:59 PM | Updated on Sep 12 2017 1:17 AM

నగరంలో ఓ ఐస్‌క్రీం కంపెనీ, ఓ బిర్యానీ హౌస్‌పై టాస్క్‌ఫోర్సు పోలీసులు, శానిటరీ విభాగం అధికారులు దాడులు చేశారు.

కరీంనగర్: నగరంలో ఓ ఐస్‌క్రీం కంపెనీ, ఓ బిర్యానీ హౌస్‌పై టాస్క్‌ఫోర్సు పోలీసులు, శానిటరీ విభాగం అధికారులు దాడులు చేశారు. రాంనగర్‌లో గల దారపునేని కృష్ణకు చెందిన ఐస్‌క్రీమ్ కంపెనీపై టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా కల్తీ, నాసిరకపు ఐస్‌క్రీమ్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేయగా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపారు.
 
బిర్యానీ హౌస్‌లో...
కరీంనగర్‌ కోర్టు చౌరస్తాలో గల దూలం శివశంకర్‌కు చెందిన ఈ బిర్యానీ హౌస్‌లో కుళ్ళిన, దుర్వాసన వస్తున్న మాంసంతో బిర్యానీ, ఇతర పదార్ధాలు తయారు చేసి వడ్డిస్తున్నారన్న సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ సంయుక్తంగా దాడులు చేశారు. పది రోజులనాటి మాంసం, కుళ్ళిన, పాచిన కూరలకు దుర్గంధం రాకుండా సుగంధ ద్రవ్యాలు ఉపయోగించి వేడి చేసి వండి వడ్డిస్తున్నారు. అలాగే మిగిలిపోయిన బిర్యానీ నుంచి మాంసం ముక్కలు తీసి మళ్ళీ ఉపయోగిస్తూ వేడి బిర్యానీతో వడ్డిస్తున్నారు. వంట గది కూడా అపరిశుభ్రంగా ఉంది. ఫుడ్ ఇన్స్పెక్టర్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు. అక్కడినుంచి నివేదిక రాగానే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్సు సీఐ గౌస్ బాబా, ఎస్సైలు కిరణ్, సంతోష్, నాగరాజు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అమృత శ్రీ, సిబ్బంది పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement