మహాగణపతిని దర్శించుకున్న గవర్నర్‌ | Tamilisai Soundararajan Visits Khairatabad Ganesh Idol | Sakshi
Sakshi News home page

మహాగణపతిని దర్శించుకున్న గవర్నర్‌

Sep 11 2019 3:04 AM | Updated on Sep 11 2019 3:04 AM

Tamilisai Soundararajan Visits Khairatabad Ganesh Idol - Sakshi

ఖైరతాబాద్‌: నగరంలోని ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతిని తెలంగాణ కొత్త గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం సాయంత్రం మహాగణపతిని దర్శించుకున్న గవర్నర్‌ మహాగణపతి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ..ఆసియాలోనే అత్యంత ఎత్తైన ఖైరతాబాద్‌ మహాగణపతిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. బంగారు తెలంగాణ సాధనకోసం అందరూ కలసి పనిచేయాలన్నారు. భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్, కమిటీ సభ్యులు గవర్నర్‌ను ఘనంగా సన్మానించారు.

ఓనమ్‌ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌ 
సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో నివసిస్తున్న కేరళ ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఓనమ్‌ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండగ శాంతి, సౌభ్రాతృత్వాలను పెంచాలని ఆకాంక్షిస్తున్నట్లు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆమె పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement