యూనివర్సిటీల్లో డేటా బ్యాంక్‌

Tamilisai Soundararajan Urged VCs For Develop Research Data Bank - Sakshi

పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వండి 

వర్సిటీలపై వీసీలతో సమీక్ష సమావేశంలో గవర్నర్‌ తమిళిసై

సాక్షి, హైదరాబాద్‌: యూనివర్సిటీల్లో పరిశోధనలను ప్రోత్సహించాలని, అందుకు అనుగుణంగా వర్సిటీలు చర్యలు చేపట్టాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ స్పష్టం చేశారు. ప్రతి వర్సిటీ లో డేటా బ్యాంకు ఏర్పాటు చేయాలని, అందులో పరిశోధన పత్రాలు, వర్సిటీలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఉంచాలని ఆదేశించారు. రాష్ట్ర గవర్నర్‌గా వచ్చాక ఆమె తొలిసారి వర్సిటీల చాన్స్‌లర్‌ హోదాలో గురువారం అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో వైస్‌చాన్స్‌లర్లు, రిజిస్ట్రార్‌లతో 3 గంటల సమీక్ష నిర్వహించారు.

ఆహ్లాదకర వాతావరణంలో వర్సిటీల్లో విద్యా బోధన, అభ్యసన కార్యక్రమాలు ఉండేలా చూడాలన్నారు. ‘లవ్‌ అండ్‌ లెర్న్‌’, ‘ఎం జాయ్‌ అండ్‌ ఎడ్యుకేట్‌’ వాతావరణాన్ని వర్సిటీ ల్లో పెంపొందించాలని తెలిపారు. రాష్ట్రంలోని 15 వర్సిటీల్లోని అభివృద్ధి, విద్యా కార్యక్రమాలపై అధికారులు నివేదికలు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇప్పటివరకు పాఠశాల విద్యలోనే ఉన్న స్టూడెంట్స్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ విధానాన్ని వర్సిటీల్లోనూ అమలు చేయాలన్నారు. అందులో విద్యా ర్థుల ఆరోగ్య వివరాలు ఉండాలన్నారు. విద్యార్థుల పోషక సూచికను అభివృద్ధి చేయాలని, పాఠ్యాంశాల్లో యోగా చేర్చాలని చెప్పారు. వర్సిటీల్లో ఏటా స్నాతకోత్సవాలు నిర్వహించాలని, తాను కచ్చితంగా అందులో పాల్గొంటానని తెలిపారు.  

దేశంలోనే ముందుంచేలా పనిచేయండి.. 
తెలంగాణను విద్యారంగంలో దేశంలోనే ముం దుంచేలా సమష్టిగా పనిచేయాలని సూచించారు. అందుబాటులోని వనరులతో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలన్నారు. గ్రామాలను వర్సిటీలు దత్తత తీసుకోవాలన్నారు. ఉన్నత విద్యలో కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలను వివరిం చారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ లింబాద్రి, వర్సిటీల ఇన్‌చార్జి వీసీలు అరవింద్‌కుమార్, ప్రశాంతి, అనిల్‌ కుమార్, రాహుల్‌ బొజ్జా, చిరంజీవులు, సందీప్‌కుమార్‌ సుల్తానియా, ప్రవీణ్‌రావు, కవిత, గోవర్ధన్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top