కొత్త గవర్నర్‌  బాధ్యతల స్వీకరణ నేడు | Tamilisai Soundararajan To Take Oath As Governor On 8th September | Sakshi
Sakshi News home page

కొత్త గవర్నర్‌  బాధ్యతల స్వీకరణ నేడు

Sep 8 2019 2:42 AM | Updated on Sep 8 2019 2:42 AM

Tamilisai Soundararajan To Take Oath As Governor On 8th September - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందర రాజన్‌ ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉద యం 8 గంటలకు ఆమె చెన్నై నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర ఎస్‌.చౌహాన్‌ ఆదివారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం  కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, సీనియర్‌ అధికారులు పాల్గొంటారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి రెండో గవర్నర్‌గా, తొలి మహిళా గవర్నర్‌గా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్త గవర్నర్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement